తీగనై మల్లెలు పూచిన వేళ….
ఆగనా అల్లనా పూజకో మాల……
మనసు తెర తీసినా మోమాటమేనా …..
మమత కలబోసినా మాట కరువేనా……
తీగనై మల్లెలు పూచిన వేళ …..
ఆగనా అల్లనా పూజకో మాల……
తెలిసీ తెలియందా ఇది తెలియక జరిగిందా……
ఎపుడో జరిగిందా అది ఇపుడే తెలిసిందా……
ఆశ పడ్డా అందుతుందా అర్హతైనా ఉందా……
అందుకున్నా పొందికుందా పొత్తు కుదిరేనా……
ప్రేమకన్నా పాశముందా పెంచుకుంటే దోషముందా……
తెంచుంకుంటే తీరుతుందా పంచుకొంటే మరిచేదా……
కలలో మెదిలిందా ఇధి కధలో జరిగిందా……
మెరుపై మెరిసిందా అది వలపై కురిసిందా……
రాసి ఉంటే తప్పుతుందా తప్పు నీదవునా……
మారమంటే మారుతుందా మాసిపోతుందా……
చేసుకున్నా పుణ్యముందా చేరుకొనే దారి ఉందా……
చేదుకొనే చేయి ఉందా చేయి చేయి కలిసేనా……
తీగనై మల్లెలు పూచిన వేళ …..
ఆగనా అల్లనా పూజకో మాల……
మనసు తెర తీసినా మోమాటమేనా…..
మమత కలబోసినా మాట కరువేనా……
తీగనై మల్లెలు పూచిన వేళ…..
ఆగనా అల్లనా పూజకో మాల……